Head Lines :

నాకు కొంచం తిక్కుంది.. దానికో "లెక్కుందీ" అంటున్న తమన్న



తెలుగు పరిశ్రమలో హీరోల డామినేష‌న్ ఎక్కువ‌గా కనిపిస్తుంది. హీరోయిన్లు కూడా దానికి అల‌వాటు ప‌డిపోయారు. కానీ త‌మ‌న్నా మాత్రం... ఈ డామినేష‌న్ తట్టుకోలేక‌పోతోంది. త‌న మాటల్లో అదే బ‌య‌ట ప‌డింది.
చేతిలో హిట్టు లేక‌పోయినా - పారితోషికంతో నిర్మాత‌ల్ని బెంబేలెత్తించ‌డం మ‌న క‌థానాయిక‌ల‌కు మామూలే. ఒక్కొక్క‌రూ కో... కో అంటూ కోటికి కూత పెడుతున్నారు. త‌మ‌న్నా కూడా అదే పాట పాడుతోంది. నిన్నా మొన్నటి వ‌ర‌కూ ఆమె పారితోషికం రూ.80 లక్షలేన‌ట‌. అమాంతం మ‌రో 20 పెంచి రౌండ్ ఫిగ‌ర్ చేసింది.

అదేంట‌ని అడిగితే... ''మా క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ఆశిస్తే త‌ప్పేంటి? హీరోల‌కు ఇచ్చిన దానితో పోలిస్తే మాదెంత‌...?'' అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోంద‌ట‌. ఈ పారితోషికం ఓక్కటేన, ఫైట్ స్టార్ వ‌స‌తులు, సిబ్బంది జీత‌భ‌త్యాలూ అంటూ - హీరోయిన్ల విష‌యంలో ఖ‌ర్చు త‌డిసిమెపెడ‌వుతోంద‌ని నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.



English Summary
Thamanna fires on heros and directors

                                                                                                          Source:- apherald.com
Share this article :

Post a Comment

 
Support : Andhra Music | AtoZpulse | Mirchi 9
Copyright © 2013. Telugu - All Rights Reserved
Created by Abhi Rocksz Published by Tolly Trendz
Proudly powered by Tolly Trendz